ప్రియాంక సీఎం.. అది జోక్ !

వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కరువయ్యాడు. ఇప్పటికీ అధ్యక్ష బాధ్యతలను సోనియా గాంధీ భారంగానే మోస్తున్నారు. అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు ఆయన మరోసారి అధ్యక్షుడిగా ఉంటానని ముందుకొచ్చినా.. ఆయనపై పజలకు, సొంత పార్టీ నేతలకే నమ్మకం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే కాంగ్రెస్ లోని ఓ వర్గం ఎప్పటి నుంచో అంటోంది.

అయితే అంతకంటే ముందే వచ్చే నెలలో జరిగే యూపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంకను ఫోకస్ చేయాలను అనుకున్నారు. ఆమె కూడా తాను కాకపోతే ఇంకెవ్వరు ?అని నిన్ననే స్టేట్ మెంట్ ఇచ్చింది. అయితే ఆ ప్రకటనపై 24 గంటలు తిరక్కుండానే ఆమె యూ టర్న్ తీసుకోవడం గమనార్హం. యూపీ సీఎం అభ్యర్థి విషయంలో ఆమె మాట మార్చేశారు. జస్ట్ జోక్ చేశానంటూ…తెలిపారు. దీంతో నాయకులు నోరెళ్లబెడుతున్నారు.  యూపీ సీఎం అభ్యర్థిని తానేన‌న్న ఊహల్లో ఉండొద్దని, ప్రస్తుతం తాను పార్టీ ప్రధాన కార్యద‌ర్శిన‌ని, ఆ ప‌నుల‌ను నిర్వర్తిస్తున్నట్లు ప్రియాంక తెలిపారు.

మరోవైపు యూపీ ఎన్నికల్లో అధికార భాజాపాను గట్టిగా ఢీకొంటోంది ఎస్పీ. ఆ పార్టీ అధ్యక్షుడిగా, సీఎం అభ్యర్థిగా అఖిలేష్ యాదవ్ దూసుకెళ్తున్నారు. భాజాపా మంత్రులు కూడా ఎస్పీలో చేరుతున్నారు. యూపీలో వచ్చేది అఖిలేష్ ప్రభుత్వమేననే ప్రస్తుత ట్రెండ్ ను బట్టీ అర్థమవుతుంది అంటున్నారు. అయితే హస్తం పార్టీ మాత్రం యూపీలో సోయిలో లేకుండా పోతుంది. కనీసం సీఎం అభ్యర్థిని ప్రకటించే విషయంలోనూ నిర్లక్ష్యం విడటం లెడు. ప్రియాంక గాంధీ తానే సీఎం అభ్యర్థి అంటే.. యూపీ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కానీ.. ఆమె ఆ బాధ్యతల నుంచి 24 గంటలు తిరక్కముందే పారిపోవడం.. బాధకరం అంటున్నారు.