RRR బాహుబలి సెంటిమెంట్

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది #RRR చిత్రబృందం. కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించింది. మార్చి 18న లేదంటే ఏప్రిల్ 28న #RRR రిలీజ్ ఉంటుందని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుంది. అది మార్చి నెలకల్లా తగ్గుముఖం పట్టనుంది. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నారు. 

ఒకవేళ అప్పటికి కరోనా తగ్గుముఖం పట్టకుంటే ఏప్రిల్ 28న #RRRని రిలీజ్ చేయనున్నారు. అయితే ఏప్రిల్ 28 – బాహుబలి 2 విడుదలైన రోజు. 2017 ఏప్రిల్ 17న బాహుబలి 2 రిలీజైంది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇండియన్ సినిమా స్థాయిని పెంచేసింది. ఇప్పుడు.. ఇదే రోజున #RRR రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాల్లోని ఓ ఉమ్మడి పాయింట్ ఆధారంగా రాజమౌళీ ఈ కథని తెరకెక్కించారు. అల్లూరిగా రామ్ చరణ్, ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించారు. కొమరం భీమ్ గా ఎన్ టీఆర్, ఆయనకు జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటించారు. అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం. డివివి దానయ్య నిర్మించారు. 

IF #RRR arrives on 28 April 2022, it would be the same date as #Baahubali2. @RRRMovie @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @aliaa08 @DVVMovies #ottrelease #ott pic.twitter.com/o64582vzPi— OTTRelease (@ott_release) January 22, 2022