శ్రీరెడ్డి మెగా పశ్చాతాపం (వీడియో).. వైరల్ !

హాట్ బ్యూటీ శ్రీరెడ్డి మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనీ దేవికి క్షమాపణలు చెప్పారు. గతంలో ఆమెను తిట్టాను. దానికి ఫలితం కూడా అనుభించారు. ఇప్పుడు జూబ్లీహీల్స్ పెద్దమ్మ తల్లి సాక్షిగా క్షమాపణలు చెబుతున్నాని.. ఓ వీడియోని విడుదల చేశారు. ఇప్పుడీ.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. 

“ఆడవాళ్ల కోసం చేసే ఉద్యమానికి న్యాయం జరగాలంటే.. ఒక ఆడదాన్ని తిట్టాలని ఒక పెద్ద మనిషి నా బ్రెయిన్ వాష్ చేసి అతని పంతం కోసం నన్ను ఉపయోగించుకున్నాడు. అతనికి చిరంజీవికి ఎలాంటి తగాదాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ.. చిరంజీవి కుటుంబం తరలివస్తుందని ఈ పెద్ద మనిషి ఇచ్చిన సలహాతో నేను అమాయకురాలైన అమ్మని తిట్టారు. ఈ ఇష్యూతో ఏ సంబంధం లేని తల్లిని నేను తిట్టాల్సి వచ్చింది. దానికి శిక్ష కూడా నేను అనుభవించాను. సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నాను. పర్సనల్‌గా నాకు ఫోన్లు చేసి బెదిరించారు. మా సొంతవాళ్లు కూడా అలా అనడం తప్పు అని చెప్పారు. ఆ విషయంలో నేను ఇప్పటికీ బాధపడుతున్నాను. 

అందుకే అమ్మవారి శక్తి (పెద్దమ్మ టెంపుల్) ముందు నేను చెప్తున్నా.. ఒక ఆడదాన్ని అన్యాయంగా తిట్టడం తప్పే. దానికి నేను ఒప్పుకుంటున్నా.. నేను తప్పు చేశాను.. పెద్ద మనసు చేసుకుని ఆ పెద్దమ్మ తల్లి ఎలాగైతే క్షమిస్తుందో నన్ను కూడా క్షమించండి. ఇండస్ట్రీలో చిరంజీవి అనేవారు ఒక పెద్ద హీరో.. వాళ్ల అమ్మగారిని నేను తిట్టాల్సింది కాదు.. నా బుద్ది గడ్డితిని అన్నాను. నన్ను మభ్యపెట్టి తిట్టించారు. అమ్మవారి సాక్షిగా ఈరోజు చిరంజీవి తల్లిగారు అంజనా దేవి గారికి క్షమాపణ చెప్తున్నాను. నా జీవితంలో నేను తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరడానికి సిగ్గుపడను. ఎందుకంటే ఆ పాపాన్ని మోయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే అంజనా దేవి గారూ నన్ను క్షమించండి’ అంటూ క్షమాపణ కోరింది శ్రీరెడ్డి.

నన్ను క్షమించండి “అంజనమ్మ” 🙏🙏🙏😭😭 pic.twitter.com/fnBvee9qRt— Sri Reddy (@MsSriReddy) January 22, 2022