భీమ్లా నాయక్ – ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. భీమ్లా నాయక్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. పవన్ కెరీర్ లోనే బెస్ట్ సినిమా కాబోతుందని సంగీత దర్శకుడు థమన్ చెప్పేశారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ తెరకెక్కుతోంది.

త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. థమన్ సంగీతం. మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’కు తెలుగు రీమేక్ ఇది. ఇందులో పవన్ పోలీస్ అధికారిగా నటించారు. రానా మరో ప్రధాన పాత్ర పోషించారు. నిత్యా మేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో థమన్ మాట్లాడుతూ.. ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా చూసేశాను. త్రివిక్రమ్ తో కలిసి రషెస్ చూశాను. చాలా బాగా వచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది పవన్ కల్యాణ్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీ. నావైపు నుంచి వీలైనంత మంచి మ్యూజిక్ ఇస్తానని హామీ ఇస్తున్నాను” నని థమన్ చెప్పుకొచ్చారు.

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన భీమ్లా నాయక్ రెండు పాన్ ఇండియా సినిమాలు ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ లకు దారి ఇస్తూ.. వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కరోనా ఎఫెక్ట్ తో సంక్రాంతి బరిలో ఉన్న ఆ రెండు పాన్ ఇండియా సినిమాలు సైతం వాయిదా పడక తప్పలేదు.

it’s came out extraordinary, its a career best film for #PawanKalyan 🔥

I have contributed best for the movie.

@MusicThaman Via Ntv#BheemlaNayak #Trivikram pic.twitter.com/ZRzi5ShvEH— PK-Dhoni™ (@PKDHONIII) January 23, 2022