భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,55,874 కొత్త కేసులు నమోదయ్యాయి.. అంటే నిన్నటితో పోలిస్తే 16 శాతం మేర కొత్త కేసులు తగ్గాయి. 20 శాతం దాటిన రోజువారీ పాజిటివిటీ రేటు.. 15.52 శాతానికి పడిపోయింది. 

ఒక్క కర్ణాటకలోనే 46 వేల కేసులుండగా.. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే కొవిడ్ మృతుల సంఖ్యలో మాత్రం పెరుగుదల కనిపిస్తోంది. నిన్న 614 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 171 మరణాలు కేరళలో చోటు చేసుకొన్నవే. ఈ రెండేళ్ల కాలంలో 3.97 కోట్ల మందికి వైరస్ సోకగా.. 4.9 లక్షల మంది మృత్యుఒడికి చేరుకున్నారు. నిన్న 2,67,753 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.7 కోట్లు (93.15 శాతం)గా ఉన్నాయి. ప్రస్తుతం 22.3 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. క్రియాశీల రేటు 5.62 శాతంగా ఉంది.