తెలంగాణలో నైట్ కర్ఫ్యూ.. డీహెచ్ ప్రకటన !

తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించనున్నారనే ప్రచారం జరుగుతుంది.

తాజాగా దీనిపై రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డాక్టర్‌ డి.శ్రీనివాసరావు స్పష్టత ఇచ్చారు. పాజిటివిటీ రేటు 10శాతం దాటితే కర్ఫ్యూ అవసరమని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16శాతం ఉందని ఆయన వివరించారు. ఒక్క జిల్లాలోనూ ఆ రేటు 10శాతం మించలేదని డీహెచ్‌ చెప్పారు.

 రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో డీహెచ్‌ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీలో 4.26శాతం, మేడ్చల్‌లో 4.22శాతం.. మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 6.45శాతం, కొత్తగూడెంలో అతి తక్కువగా 1.14శాతం పాజిటివిటీ రేటు ఉంది. ఐసీయూ, ఆక్సిజన్‌ పడకల ఆక్యుపెన్సీ 61శాతంగా ఉంది.

ముందు జాగ్రత్త చర్యగా జనం గుమిగూడకుండా ఈ నెల 31 వరకు ఆంక్షలు కొనసాగుతాయి. వారం రోజులుగా లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోంది. మూడు రోజుల్లోనే లక్షణాలున్న 1.78లక్షల మందికి కిట్లు పంపిణీ చేశాం. 18ఏళ్లలోపు వారిలో 59శాతం మందికి వ్యాక్సినేషన్‌ జరిగింది. రాష్ట్రంలో 2.16లక్షల మందకి ప్రికాషన్‌ డోసు ఇచ్చాం అని డీహెచ్‌ అన్నారు.