స్లిమ్ గా మారిన రోహిత్ శర్మ

తొడ కండరాల గాయంతో సౌతాఫ్రికా పర్యటన మొత్తానికి దూరమైన రోహిత్ శర్మ.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. తరుచూ ఫిట్‌నెస్ సమస్యలు ఎదురవుతుండటంతో శాశ్వత పరిష్కారంపై దృష్టిపెట్టిన హిట్‌మ్యాన్ వైద్యులు, ఫిట్‌నెస్ నిపుణుల సూచనల మేరకు బరువు తగ్గడంపై దృష్టిసారించాడు. ఈ క్రమంలోనే గత రెండు నెలల్లో అతను ఏకంగా 6 కిలోల బరువు తగ్గినట్లు ఎన్‌సీఏ వర్గాలు తెలిపాయి.

టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న రోహిత్.. మరింత ఫిట్ గా ఉండేందుకు శ్రమిస్తున్నారు.  ఇప్పటికే టీ20, వన్డే కెప్టెన్సీ బాధ్యతలతో పాటు టెస్ట్ వైస్ కెప్టెన్సీని అందుకున్న హిట్ మ్యాన్.. పూర్తి స్థాయి సారథ్య బాధ్యతలు అందుకోవాలనుకుంటున్నాడు.