మార్కెట్లపై ‘ఫెడ్’ దెబ్బ
ఈ ఏడాది మార్చిలో వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ‘అమెరికా ఫెడరల్ రిజర్వ్’ బుధవారం అర్ధరాత్రి వెల్లడించింది. దీంతో గురువారం ఆసియా మార్కెట్లు కుదేలవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఆరంభంలోనే దాదాపు 1000 పాయింట్లకు పైగా పతనమవ్వగా.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 17వేల మార్క్ వద్ద ఊగిసలాడుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.
ఈ మార్చి నాటికి నెలవారీ బాండ్ల కొనుగోలు కార్యక్రమం ముగియనున్నందున ఆ సమయంలోనే రేట్ల పెంపు చేపట్టే అవకాశముందని ఫెడ్ సంకేతాలిచ్చింది. 0.25శాతం పెంచొచ్చని తెలిపింది. ఈ నిర్ణయం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.