ఎయిరిండియాలో టాటా భోజనం
టాటా గ్రూప్ పేరు కింద ఎయిరిండియా విమానాలు ఈరోజు నుంచే నడుస్తున్నాయి. టాటా గ్రూప్ నుంచి ఎయిరిండియాను తీసుకున్న 69 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ సంస్థకే ప్రభుత్వం అప్పగించింది. ప్రభుత్వం నిర్వహించిన వేలం ప్రక్రియ ద్వారా ఎయిరిండియాను టాటా గ్రూపు అనుబంధ సంస్థ ట్యాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ గతేడాది అక్టోబరు 8న రూ.18,000 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
కొన్ని విమానాల్లో మెరుగైన భోజన సదుపాయం కల్పించడం ద్వారా, ఆ సంస్థలో తన కార్యాచరణను ప్రారంభించనుందని టాటా. ముంబయి నుంచి నాలుగు మార్గాల్లో గురువారం బయలుదేరే సర్వీసుల్లో ‘ప్రత్యేక భోజన సేవల’ను టాటా ప్రవేశపెట్టనుంది. ఏఐ 864 (ముంబయి-దిల్లీ), ఏఐ687 (ముంబయి-దిల్లీ), ఏఐ945 (ముంబయి-అబుదాబీ), ఏఐ639 (ముంబయి-బెంగళూరు) మార్గాల్లో ఈ భోజన సేవలు మొదలుకానున్నాయి.