యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఏకాదశి వేడుకల్లో బాగంగా శుక్రవారం లక్షపుష్పార్చన పూజలను సంప్రదాయరీతిలో నిర్వహంచారు. బాలాలయంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. అర్చకులు, వేదపండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో లక్షపుష్పార్చన పూజలు నిర్వహించారు.
ప్రతీ ఏకాదశి పర్వదినం రోజున స్వామిని వివిధ రకాల పుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయంగా కొనసాగుతుంది. సుమారు రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజలను అర్చకబృందం, వేదపండితులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.