NTR30 కోసం అనిరుధ్

కొరటాల శివ దర్శకత్వంలో #NTR30 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, ఆచార్య తర్వాత కొరటాల చేయనున్న సినిమా ఇది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా నటించనుంది. సంగీత దర్శకుడిగా కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ ని తీసుకున్నారు.
ఈ సినిమాలో తారక్ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. విద్యా వ్యవస్థలోని లోపాలను ఈ సినిమా ద్వారా లేవనెత్తబోతున్నాడు కొరటాల. అయితే దానికి కమర్షియల్ ఫార్మెట్ లో ఎలా చూపించబోతున్నాడు అన్నది ఆసక్తికర అంశం. గతంలో కొరటాల-ఎన్ టీఆర్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు వీరి కాంబోలో రాబోతున్న రెండో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.