బాలీవుడ్ లో ‘పుష్ప’ సెంచరీ

సుకుమార్ – అల్లు అర్జున్ ల హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా సినిమా వచ్చిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాలీవుడ్ లో ‘పుష్ప’ హవా ఇప్పటికీ  కొనసాగుతోంది. ఈ క్రమంలో పుష్ప హిందీ కలెక్షన్స్ రూ. 100 కోట్లు దాటేశాయి. మొదటి రోజు నుంచి బాలీవుడ్ లో పుష్పకు మంచి ఆదరణ లభించింది. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలను కాదని.. పుష్ప కు బాలీవుడ్ ప్రేక్షకులు పట్టం కట్టారు. ప్రతిరోజూ రూ. 4 నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 

ఇక థియేటర్స్ లో చూడని వారు ఓటీటీలో పుష్పను వీక్షిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలోనూ పుష్పకు రికార్డ్ కలెక్షన్స్ దక్కడం విశేషం. ఈ చిత్రంలో బన్నీకి జంటగా రష్మిక మందన నటించింది. స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ లో మెరిసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీస్ నిర్మించింది.