ఆస్ట్రేలియన్‌ ఓపెన్ విజేత నాదల్

స్పెయిన్‌ బుల్‌ నాదల్‌ టెన్నిస్‌ ప్రపంచంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లను కైవసం చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్ టైటిల్ పోరులో  మెద్వెదెవ్‌పై 2-6, 6-7, 6-4, 6-4, 7-5 తేడాతో రఫెల్‌ నాదల్ విజయం సాధించాడు. దీంతో తన కెరీర్‌లో రెండో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 21వ గ్రాండ్‌స్లామ్‌ గెలుచుకోవడం విశేషం.

వరుసగా రెండు సెట్లను కోల్పోయిన నాదల్‌ ఎక్కడా తగ్గలేదు. తన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి చివరి మూడు సెట్లలో (6-4, 6-4, 7-5) విజయం సాధించి రికార్డు నమోదు చేశాడు. దాదాపు ఐదున్నర గంటలపాటు మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇప్పటి వరకు ఐదు సార్లు వీరిద్దరూ తలపడగా.. ఒక్కసారి మాత్రమే మెద్వెదెవ్ గెలిచాడు. మిగతా నాలుగుసార్లు నాదల్‌ విజయం సాధించాడు.