ఆర్ఆర్ఆర్.. ఏప్రిల్ 28కి ఫిక్స్ !

కరోనా థర్డ్ వేవ్ విజృంభణతో సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొత్త రిలీజ్ డేట్ పై ఇటీవలే ఆర్ఆర్ఆర్ చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. రెండు డేట్స్ మార్చ్ 18, ఏప్రిల్ 28 లను లాక్ చేసింది. మార్చ్ లో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టకుంటే.. ఏప్రిల్ లో రిలీజ్ చేద్దామనే ప్లాన్ లో ఉంది. అయితే ఫిబ్రవరిలోనే దేశంలో కరోనా తగ్గుముఖం పట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. మార్చ్ 18న ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కు ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చు.

అయితే ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం మాత్రం ఏప్రిల్ 28కే ఓటేసినట్టు సమాచారం. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రావొచ్చని తెలుస్తున్నది. తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాల్లోని ఓ ఉమ్మడి పాయింట్ ఆధారంగా రాజమౌళీ ఈ కథని తెరకెక్కించారు. అల్లూరిగా రామ్ చరణ్, ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించారు. కొమరం భీమ్ గా ఎన్ టీఆర్, ఆయనకు జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటించారు. అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం. డివివి దానయ్య నిర్మించారు.