సన్నీ సన్ డే ట్రీట్

బాలీవుడ్ హాట్ బ్యూటీగా మారిన శృంగార తార సన్నీ లియోన్ కు అభిమానులను ఎలా సంతృప్తి పరచాలి అనే విషయం బాగా తెలుసు. అందుకే సన్ డే రోజున స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. ఇటీవల మాల్దీవుల్లో పింక్ బికినీ లో రెచ్చిపోయిన ఫోటో షూట్ ఫోటోల నుంచి ఓ హాట్ పిక్ ని షేర్ చేసింది. సండే స్పెషల్ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

2012లో వచ్చిన ‘జిస్మ్’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సన్నీ. మొదట్లో సన్నీని సూటి పోటీ మాటలతో బాలీవుడ్ గాయ పరిచింది. అయితే అవన్నీ తట్టుకొని.. హాట్ బ్యూటీ నిలదొక్కుకుంది. వరుస ఆఫర్లను అందుకుంది. జాక్ పాట్, రాగిణి ఎంఎంఎస్2, ఏక్ పహెలే లీలా, వన్ నైట్ స్టాండ్.. తదితర సినిమాల్లో నటించింది. బిగ్ స్క్రీన్‌పై బికినీలతో అట్రాక్ట్ చేసింది. నటిగా, ఐటమ్ స్పెషలిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ తెరపై కూడా మెరిసింది. కరెంట్ తీగ, గరుడ వేగ చిత్రాల్లో నటించింది.