BiggBoss15 విజేత తేజస్వి ప్రకాశ్

హిందీ బిగ్ బాస్ సీజన్-15 విజేతగా టీవీ స్టార్ తేజస్వి ప్రకాశ్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నటుడు-మోడల్ ప్రతీక్ సెహజ్ పాల్ పై గెలిచి, ట్రోఫీ అందుకుంది. బిగ్ బాస్  ట్రోఫీతో పాటు తేజస్వి.. రూ.40 లక్షల ప్రైజ్ మనీని కూడా సొంతం చేసుకుంది. తేజస్వి ప్రకాశ్ బాయ్ ఫ్రెండ్ కరణ్ కుంద్రా.. మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్ లో తేజస్వీ-కరణ్ కుంద్రా లవ్ ట్రాక్ హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

గ్రాండ్‌గా జరిగిన ఈ ఫినాలే ఈవెంట్‌లో 13వ సీజన్‌ కంటెస్టెంట్‌ షెహనాజ్‌ గిల్‌ కూడా భాగస్వామి అయింది. ఆమె బాయ్‌ప్రెండ్‌ , దివంగత నటుడు సిద్ధార్థ్‌ శుక్లాని గుర్తు చేసుకుంటూ.. డాన్స్‌ ఫెర్పార్మన్స్‌తో స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చింది షెహనాజ్‌. బిగ్ బాస్ 15 ఫైనల్ లో సిద్ధార్థ్ శుక్లాకు నివాళి అర్పించారు. ఇక ఫినాలేలో ‘గెహ్రాహియ’ టీమ్ వచ్చి సందడి చేసింది. దీపిక, అనన్య, సిద్ధాంత్ చతుర్వేది సూపర్ ఫన్ పంచారు.