హృతిక్ తో డిన్నర్ పార్టీ.. మిస్టర్ గర్ల్ డిటేల్స్ ఇదిగో.. !

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోశన్ ఓ యంగ్ లేడీ కనబడటం హాట్ టాపిక్ గా మారింది. వీకెండ్ లో మిస్టరీ గర్ల్ తో కలిసి డిన్నర్ పార్టీ చేసుకున్నాడు హృతిక్. ఆమె చేయి పట్టుకొని జాగ్రత్తగా కారులో కూర్చోబెట్టారు. అప్పటి నుంచి ఆ మిస్టరీ గర్ల్ ఎవరో తెలుసుకొనేందుకు బాలీవుడ్ మీడియా తెగ ట్రై చేస్తుంది.

దాదాపు రెండ్రోజుల రిసెర్చ్ తర్వాత ఆ మిస్టరీ గర్ల్.. హిస్టరీ బయటికొచ్చింది. ఆమె నటి, మ్యూజీషియన్ సబ ఆజాద్ (Saba Azad) అని తెలిసింది. ఇక హృతిక్ తో ఆమెకున్న రిలేషన్ ఏంటీ ? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

 ప్రస్తుతం హృతిక్ ‘విక్రమ్ వేద’లో నటిస్తున్నారు. బర్త్ డే సందర్భంగా హృతిక్ రోషన్ లుక్ విడుదల చేశారు. గాయత్రీ-పుష్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ వేద తమిళ్ హిట్ చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. హృతిక్ రౌడీ పాత్ర చేస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ పోలీసు పాత్ర చేస్తున్నారు.