మళ్లీ ముందస్తుకు కేసీఆర్.. ఈ డిసెంబర్ లోనే ఎన్నికలు ?
ప్రత్యర్థులు నిద్రలేచే లోపే పని పూర్తి చేయడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకత. గత అసెంబ్లీ ఎన్నికల్లో అదే చేసిండు. ముందస్తు ఎన్నికలకు పోయిండు. మరోసారి విజయం సాధించిండు. అయితే ఈ సారి కూడా సీఎం కేసీఆర్ ముందస్తు ఆలోచన చేస్తున్నారనే వార్తలు వినిపించాయి. అది నిజమేనని ప్రగతి భవన్ వర్గాల సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు. ఈలోగా కొన్ని పనులను చక్కదిద్దే పనిలో గులాబి బాస్ ఉన్నట్టు తెలుస్తుంది.
ఎన్నికల ప్రధాన అస్త్రంగా తీసుకొచ్చిన ‘దళిత బంధు’ను అమలు చేయనున్నారు. హుజురాబాద్ లో పైలెట్ ప్రాజెక్ట్ గా, మిగిలిన నియోజకవర్గాల్లో.. ఒక్కో నియోజకవర్గం నుంచి 100 దళిత కుటుంబాలకు పథకాన్ని అమలు చేయనున్నారు. ఇదీగాక.. రైతుల కోసం కేసీఆర్ కొత్త పథకాన్ని తీసుకొస్తున్నారు. రైతులకు పింఛన్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత ఎన్నికలకు పోనున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగ నోటిఫికేషన్స్ ప్రకటించనున్నారు. మొత్తానికి… కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం దాదాపు ఖాయం అయింది. ఈలోపు కొన్ని పనులు పూర్తి చేయడమే మిగిలి ఉంది. ఇక మరోసారి టీఆర్ఎస్ గెలిస్తే.. కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఇందుకోసం ఎప్పటి నుంచో కసరత్తు చేస్తున్న కేసీఆర్.. గ్రౌండ్ రెడీ చేసి ఉంచారు. కేటీఆర్ కు పట్టాభిషేకం చేయడమే తరువాయి.