పవన్ పాన్ ఇండియా స్టార్ అవ్వాల్సిందే.. ఆర్జీవీ డిమాండ్ !

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పొద్దున పొద్దునే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై దాడి మొదలెట్టాడు. ట్విట్టర్ వేదికగా పవన్ పాన్ ఇండియా స్టార్ కావాల్సిందేనని డిమాండ్ చేశారు. మీ తర్వాత వచ్చిన పిల్లలు ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు పాన్ ఇండియా స్టార్స్ అయిపోతున్నారు. మీరెందుకు కావడం లేదు. అభిమానులు మేమెలా తలెత్తుకోవాలి ? అంటూ వరుస ట్వీట్ చేశారు ఆర్జీవీ. ఆయన ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

“ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా పవన్ ? ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం  మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది.దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి.

అల్లు అర్జున్ గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైం లో పెట్టాను కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైం లో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి పవన్.  పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి ? పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము” అంటూ ఆర్జీవీ రాసుకొచ్చారు. 

ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా @pawanKalyan గారూ???— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022