మార్చ్ 25న ఆర్ఆర్ఆర్, ఏప్రిల్ 29న ఆచార్య

రిలీజ్ కి రెడీగా ఉన్న తెలుగు సినిమాల కొత్త రిలీజ్ డేట్స్ ఖరారయ్యాయి. మార్చ్ 25న ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి మార్చ్ 18 లేదా ఏప్రిల్ 28 డేట్స్ ను ఆర్ ఆర్ ఆర్ కోసం లాక్ చేశారు. కానీ ఈ రెండు డేట్స్ ని కాదని మార్చ్ 25కి ఆర్ ఆర్ ఆర్ షిఫ్ట్ అవ్వడం విశేషం. 

ఇక ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ తర్వాతే వస్తానని కంకణం కట్టుకున్న ఆచార్య ఏప్రిల్ 29కి ఫిక్సైపోయాడు. అయితే అంతకంటే ఒకరోజు ముందే నవ్వుల సినిమా ఎఫ్ 3 రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. ఆర్ ఆర్ ఆర్ మార్చ్ 25న రిలీజైన తర్వాత దాదాపు నెలరోజుల పాటు పెద్ద సినిమా లేకుండా జాగ్రత్తపడినట్టు కనిపిస్తుంది. అయితే భీమ్లా నాయక్ ఏప్రిల్ 1న కాకుండా ఫిబ్రవరి 25న వస్తే.. ఆర్ ఆర్ ఆర్ కు రిలీఫ్. లేదంటే పవన్ తో పోటీ తప్పదు.