తెలుగు బిగ్ బాస్ OTT ఎప్పటి నుంచి అంటే.. ?

హిందీ ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఆరో సీజన్ కు రెడీ అవుతుంది. అంతేకంటే ముందు తెలుగు బిగ్ బాస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తెలుగు బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కాబోతుందని ఇప్పటికే నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది. కంటెస్టెంట్స్ ఎంపిక కొనసాగుతుంది. ఫిబ్రవరి 20 నుంచి తెలుగు ఓటీటీ ప్రారంభం కానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో బిగ్‌బాస్‌ షో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది.


ఇక తెలుగు బిగ్ బాస్ ఓటీటీ కోసం కొంతమంది మాజీ కంటెస్టెంట్లను కూడా తీసుకుంటున్నట్లు వార్తాలు వినిపిస్తున్నాయి. వారిలో అరియానా గ్లోరి ఉన్నారనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఆమెతో మంతనాలు పూర్తయ్యాయని, మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి అరియనా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. అరియానాతో పాటు మాజీ కంటెస్టెంట్స్‌ లిస్ట్‌లో ఆదర్శ్, తనీష్, అఖిల్, అలీ రెజా, హరితేజ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక కొత్త వారిలో యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ శివ, ‘ఢీ-10’ విజేత రాజు, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌’వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ వైష్ణవి, సోషల్‌ మీడియా స్టార్‌ వరంగల్‌ వందన, యాకర్‌ ప్రత్యూష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.