‘భీమ్లా నాయక్’ కోసం రెండు డేట్స్ లాక్

కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడిన తెలుగు సినిమాల కొత్త రిలీజ్ డేట్స్ ఖరారయ్యాయి. అన్ని సినిమాలు సింగిల్ డేట్ ను లాక్ చేసుకుంటే.. భీమ్లా నాయక్ మాత్రం డబుల్ డేట్స్ బుక్ చేసుకున్నాడు. ఫిబ్రవరి 25 లేదంటే ఏప్రిల్ 1న రిలీజ్ ఉంటుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ రెండు డేట్స్ ను భీమ్లా నాయక్ కు పెద్దగా పోటీ లేదు. ఫిబ్రవరి 25న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా రానుంది. అయితే పవన్ ఇదే డేటుకి రావడం పక్కా అని తేలితే.. ఆడవాళ్లు సైడైపోయే అవకాశాలే ఎక్కువ. ఇక ఏప్రిల్ 1న ఏ ఇతర సినిమా రావడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ సింగిల్ గా బాక్సీఫీస్ ను ఏలే అవకాశాలు కనిపిస్తున్నాయి.