‘బ్లాక్ బడ్జెట్’ అంటే ఏంటో తెలుసా ?

నవంబర్ 26, 1947న అప్పటి ఆర్థిక మంత్రి షణ్ముఖం శెట్టి తొలి బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి రేపు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ వరకు ఎన్నో కీలక బడ్జెట్ లను ఈ దేశం చూసింది. దేశ గతిని మార్చి పెను మార్పులకు కారణమైన కొన్ని మాత్రం ప్రజలకు ఇప్పటికీ గుర్తిండిపోయాయి. వారిలో ఒకటి బ్లాక్ బడ్జెట్.

1973-74లో ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలో యశ్వంత్ రావు బి చవాస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ‘బ్లాక్ బడ్జెట్’గా పిలుస్తారు. ఎందుకంటే ? ఆ ఏడాది ద్రవ్యలోటు రూ. 550 కోట్లకు చేరుకొని దేశం ఆర్థిక ఒత్తిడిలో చిక్కుకున్న తరుణంలో వచ్చింది .

చారిత్రాత్మక బడ్జెట్ :

పీవీ నరసింహారావు హయాంలో మన్మోహన్ సింగ్ 1991లో తీసుకొచ్చిన బడ్జెట్ ను ఎవరూ మరిచిపోలేరు. ఆర్థిక సరళీకరణలకు ఆహ్వానం పలుకుతూ.. లైసెన్స్ రాజ్ ముగింపు చెప్పిన బడ్జెట్ ఇది. యుగానికోసారి వచ్చే బడ్జెట్ గా  నిలిచింది. 


వందేళ్లకోసారి వచ్చే బడ్జెట్ :

గత ఏడాది ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన  బడ్జెట్ ను వన్స్ ఇన్ ఎ సెంచురీ బడ్జెట్ గా అభివర్ణించారు. ఆసియాలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థన పుంజుకునేలా చేయడం కోసం మౌళీక, ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు.. ప్రయివేటైజేషన్ వ్యూహానికి పను పెట్టి, పన్ను వసూళ్లను పెంచడానికి పలు ప్రతిపాదనలు చేశారు.