2023 – చిరుధాన్యాల సంవత్సరం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈసారి కూడా కాగిత రహిత బడ్జెట్ ను ఆమె సమర్పించారు.

బడ్జెట్ ప్రసంగంలో 2023 ను చిరుధాన్యాల సంవత్సరంగా నిర్మలమ్మ ప్రకటించారు. దేశీయంగా నూనె గింజల పంటల పెంఫు, రసాయన రహిత వ్యవసాయానికి ప్రోత్సాహం, నదుల అనుసంధానానికి శ్రీకారానికి పెద్ద పీట వేస్తామని చెప్పారు. కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా, పెన్నా-కావేరి నదులను అనుసంధానం చేస్తామని తెలిపారు.