AK61 కోసం మోహన్ లాల్-నాగ్

కోలీవుడ్ స్టార్ అజిత్ బోనీ కపూర్ కాంబోలో మరో సినిమా రాబోతుంది. అదే #AK61. ఈ చిత్రానికి కూడా హెచ్ . వినోద్ దర్శకుడు. అతిథి హైదరిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమా కోసం.. మలయాళ స్టార్ మోహన్ లాల్, కింగ్ నాగార్జున నటించబోతున్నారట.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ మూవీలో కీలకమైన సీనియర్ పోలీస్ కమీషనర్ క్యారెక్టర్ కోసం మోహన్ లాల్, నాగార్జులను నిర్మాత బోనీ కపూర్ అప్రోచ్ అయ్యారని తెలిసింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయింది. మార్చి 9 నుండి సెట్స్ మీదకెళ్లబోతున్నారు. ఇక అజిత్ లెటెస్ట్ సినిమా వాలిమై ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.