డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు.. ఈ-కంటెంట్ లో నాణ్యత పెంచుతాం
డిజిటల్ విద్యకు పెద్ద పీఠ వేస్తామని కేంద్రం ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యా రంగంపై దృష్టి సారించినట్టు చెప్పిన నిర్మలమ్మ.. డిజిటల్ యూనివర్సీటీని స్థాపించనున్నట్టు తెలిపారు. పీఎం విద్యలో భాగంగా టీవీ ఛానళ్ల సంఖ్యను 12 నుంచి 200కి పెంచుతున్నాం. ఈ కంటెంట్ లో నాణ్యత పెంచుతామని మంత్రి చెప్పారు.
నారీ శక్తిని ప్రాధాన్యం ఇస్తామని నిర్మలమ్మ తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ శాఖను పునర్ వ్యవస్తీకరించనున్నట్టు ప్రకటించారు. మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, మిషన్ అంగద్ పథకాలు, ఇంటింటికీ మంచినీటి సరఫరా పథకం విస్తరణ, చిన్న-మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక గ్యారెంట్ పథకం తీసుకొస్తాం. దీనికోసం రూ. 2లక్షల కోట్ల ఆర్థిక నిధులు ఇస్తామని మంత్రి తెలిపారు.