మెగా ఫ్యాన్స్.. అన్ హ్యాపీ
‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న వస్తున్నాడని తెలిసి మెగా అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. అయితే ఆ ఆనందం 24 గంటలు కూడా ఉండకుండానే ఆవిరైపోయింది. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ రిలీజ్ డేట్స్ లాక్ అయ్యాయి. ఫిబ్రవరి 25 లేదా మార్చ్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తానని గని చెప్పేశాడు. అయితే భీమ్లా నాయక్ డేట్ ఫిబ్రవరి 25ను గని లాక్ చేయడంపై మెగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు ఒకేరోజు వస్తే.. బాగుండని వార్నింగ్ లు ఇస్తున్నారు.
మరోవైపు ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ మార్చి 25న రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ రాబోతుంది. మరో డేట్ గా ఏప్రిల్ 1 డేట్ ను రామారావు కోసం లాక్ చేశారు. ఏప్రిల్ 1 అనేది భీమ్లా నాయక్ సెకండ్ ఆప్షన్. ఈ నేపథ్యంలో గని లేదా రామారావు ఆన్ డ్యూటీ సినిమాల్లో ఒక సినిమా భీమ్లా నాయక్ కు పోటీగా రావడం ఖాయమని చెప్పవచ్చు.