IPL 2022 మెగా వేలం : తుది జాబితా విడుదల

ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ 2022 మెగా వేలం జరగనుంది. ఇప్పటికే పాత జట్ల రిటెన్షన్, కొత్త టీమ్‌లు ఆటగాళ్ల ఎంపికతోపాటు వేలం కోసం రిజిష్ట్రేషన్ కూడా పూర్తి అయిపోయింది. దీంతో మెగా వేలంలో పాల్గొనే ప్లేయర్ల లిస్ట్‌ను బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 590 మంది క్రికెటర్లు మెగావేలంలో పాల్గొనబోతున్నారు.
ఇందులో 228 మంది క్యాప్‌డ్ (జాతీయ జట్లకు ఎంపికైన వారు), 355 మంది అన్‌క్యాప్‌డ్ (జాతీయ టీమ్‌కు ఎంపిక కానివారు), ఏడుగురు అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లతోపాటు కొత్తగా లఖ్‌నవూ, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు వచ్చిన విషయం తెలిసిందే.