బాహీ ఖాటా పోయే.. స్వదేశీ ట్యాబ్ వచ్చే !

2022-23 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అంతకుముందే నిర్మలమ్మ బడ్జెట్ ‘ట్యాబ్’తో రాష్ట్రపతిని కలిశారు. ఈ ఉదయం తన నివాసం నుంచి నార్త్‌బ్లాక్‌లోని ఆర్థికశాఖ కార్యాలయానికి నిర్మలమ్మ చేరుకున్నారు. అక్కడ తన బృందంతో సమావేశమైన అనంతరం.. బడ్జెట్ ట్యాబ్‌తో నేరుగా రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి బడ్జెట్ గురించి వివరించారు. అనంతరం అక్కడి నుంచి నిర్మలమ్మ బృందం పార్లమెంట్‌కు చేరుకుంది.
ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. ఆ తర్వాత నిర్మలమ్మ సంప్రదాయ బాహీ ఖాటాను వదిలి స్వదేశీ ట్యాబ్‌తో పార్లమెంట్‌కు చేరుకుంది. సభ్యులకు బడ్జెట్ సాఫ్ట్‌కాపీలు ఇవ్వనున్నారు. మరోవైపు పరిమిత సంఖ్యలో ముద్రించిన బడ్జెట్ ప్రతులను పార్లమెంట్‌కు తీసుకొచ్చారు. వీటిని మీడియా సహా మరికొందరికి అందజేశారు.