చైనా టార్గెట్ గా బడ్జెట్ లో కేటాయింపులు
కేంద్ర బడ్జెట్ లో ఈ సారి రక్షణ రంగ బడ్జెట్‌ను భారీగా పెంచింది. వీటిల్లో కూడా నావికాదళానికి పెద్దపీట వేసింది. ఎప్పటిలానే వాయుసేన ఆయుధ కొనుగోళ్లకు సంబంధించిన క్యాపిటల్ బడ్జెట్లో సింహభాగం దక్కించుకొంది. కానీ, ఈ ఏడాది నావికాదళానికి కేటాయింపుల్లో ఏకంగా 43శాతం పెరుగుదల కనిపించింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాతో తీవ్ర పోటీ నెలకొనడంతో కేంద్రం నావికదళంకు పెద్దపీట వేసినట్టు కనిపిస్తున్నది.
చైనా నావికాదళం వద్ద సంఖ్య పరంగా చూస్తే ప్రపంచంలోనే అత్యధిక నౌకలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశం హిందూమహా సముద్రంలో కూడా మెల్లగా కార్యకలాపాలను పెంచుతోంది. దీంతో డ్రాగన్‌కు అడ్డుకట్ట వేయాలంటే భారత నావికాదళం అధునాతన సామర్థ్యాలను తప్పనిసరిగా అందిపుచ్చుకోవాల్సిందే. అందుకే నావికదళం నిధులు పెంచారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సైనిక దళాలకు మొత్తం రూ.5.25లక్షల కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.4.78లక్షల కోట్ల కంటే 9.82శాతం పెంచి రూ.46,970 కోట్లను కేటాయించారు. రక్షణ దళాలు చెల్లించే పింఛన్ల మొత్తం కూడా 3శాతం వరకు పెరిగింది.