నెక్ట్స్ తారక్ తో.. థ్రిల్లింగ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమాని కన్ఫామ్ చేసింది బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. అలియా లెటెస్ట్ బాలీవుడ్ చిత్రం ‘ గంగూబాయ్ కతియావాడి’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అలియా తారక్ తో సినిమాపై స్పందించింది.

దర్శకుడు కొరటాల #NTR30 మూవీ స్టోరీ , తన పాత్ర గురించి చెప్పారనీ , తాను ఇంప్రెస్ అయ్యా. ఈ ప్రాజెక్ట్ లో భాగం అయ్యాననీ , “RRR” మూవీ తరువాత ఎన్టీఆర్ తో నటించడం థ్రిల్లింగ్ గా ఉందని చెప్పుకొచ్చారు. #RRRతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది అలియా. ఆ వెంటనే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా మరో తెలుగు సినిమా చేయడం విశేషం.