4 కోట్ల మంది కోలుకున్నారు

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు క్రమంగా అదుపులోనికి వస్తున్నాయి. కొద్ది రోజులుగా రెండు లక్షల దిగువనే నమోదవుతున్నాయి. తాజాగా కేసులు ముందురోజు కంటే 13 శాతం తగ్గి.. 1,49,394కి చేరాయి. పాజిటివిటీ రేటు 9.27 శాతానికి దిగొచ్చింది.

2020 జనవరిలో దేశంలోకి కరోనా మహమ్మారి ప్రవేశించింది. ఆ వైరస్ కారణంగా మార్చిలో తొలి మరణం నమోదైంది. నాటి నుంచి దాదాపు ఈ రెండేళ్ల కాలంలో 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఇప్పటివరకూ 4.19 కోట్ల మందికి కరోనా సోకగా.. నాలుగు కోట్ల మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 2.46 లక్షల మంది కొవిడ్ నుంచి బయటపడ్డారు. క్రియాశీల కేసుల 14 లక్షల(3.42 శాతం)కు తగ్గిపోయాయి. రికవరీ రేటు 95.39 శాతానికి చేరింది.