ఆ ముగ్గురి హవా..!

తెలుగు  సినిమా   ఇండస్ట్రీలో  ప్రస్తుతం ముగ్గురు హీరోయిన్ల హావా నడుస్తుంది. వరుస ఆఫర్ లు అందుకుంటూ తమకంటూ ఒక స్థానాన్ని ఎర్పరుచుకోవాలని చూస్తున్నారు,   ‘కృతి శెట్టి’, కేతిక శర్మ ‘, ‘శ్రీ లీల’  పోయిన సంవత్సరం విడుదలైన సినిమాలతో కొత్త హీరోయిన్ లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. వారు నటించిన సినిమాలు విజయవంతం కావడం, వారి నటనకు, అందచందాలకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో ఆ ముద్దుగుమ్మలను టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ అవకాశాలు దక్కుతున్నాయి.

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి  ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు కృతి శెట్టి అందచందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో వరుస ఆఫర్ లను సొంతం చేసుకుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు  విడుదలై మంచి విజయాన్ని సాధించాయి.  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సుధీర్ బాబు సరసన ఒక సినిమాలో, రామ్ పోతినేని సరసన ఒక సినిమాలో, నితిన్ సరసన ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన  రొమాంటిక్ సినిమాతో తెలుగు పరిచమైంది కేతిక శర్మ. . ఈ సినిమాలో ఈ హాట్ బ్యూటీ నటనకు, హాట్ హాట్ అందచందాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ ముద్దుగుమ్మ నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన లక్ష్య సినిమాలో కూడా నటించింది.  తాజాగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న రంగరంగ వైభవంగా సినిమాలో హీరోయిన్‌ గా కన్ఫర్మ్ అయింది.

శ్రీ లీల ఈ ముద్దుగుమ్మ పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.