భయమా ? భక్తా ?
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ టూర్ విచ్చేస్తున్నారు. మధ్యాహ్నం 2:30 నిమిషాలకు ఆయన హైదరాబాద్ లో దిగనున్నారు. అయితే ప్రధాని ఆహ్వానానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండనున్నట్టు మొదట వార్తలు వచ్చాయి. ప్రధానిని ఆహ్వానించే బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ కు అప్పగించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన లేఖ ఒకటి వైరల్ అయింది. నిన్న సాయంత్రం వరకు ఇదే న్యూస్ హాట్ టాపిక్.
అయితే రాత్రికి రాత్రి సీఎం కేసీఆర్ మనసు మార్చుకున్నారు. ప్రధానికి స్వయంగా ఆహ్వానం పలికేందుకు వస్తున్నా. ప్రధాని హైదరాబాద్ లో అడుగుపెట్టిన కాన్నుంచి.. ఆయన తిరిగి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేదాక.. ప్రధాని పక్కనే ఉంటానని సీఎంవో వర్గాలు స్పష్టం చేశాయి. ముందు మొహం చాటేసిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత తేరుకొని ప్రధానికి ఆహ్వానించడానికి రావడానికి గల కారణాలు ఏంటీ ? అనే చర్చ మొదలైంది. కేంద్రంతో పెట్టుకోవడం ఎందుకు ? అన్న భయమా ? లేక ప్రధాని విషయంలో ప్రోటోకాల్ పాటించాలన్న భక్తా ? అని అంటే.. కచ్చితంగా భయమే అయి ఉంటుందని అంటున్నారు.
ఎంత కాదన్న.. మోడీ ప్రభుత్వం కేంద్రంలో మరో రెండేళ్ల పాటు అధికారంలో ఉంటుంది. ఈలోగా కేంద్రం కన్నెర్ర జేస్తే.. కేసీఆర్ కు చుక్కులు కనిపించడం ఖాయం. ఇదీగాక.. హైదరాబాద్ లోనే ఉండి ప్రధాని ఆహ్వానికి వెళ్లకపోవడం.. ఎవ్వరు హర్షించరు. బహుశా.. ఈ నేపథ్యంలోనే ప్రధానికి ఆహ్వానం పలికే విషయంలో కేసీఆర్ మనసు మార్చుకొని ఉంటారని తెలుస్తున్నది.