స‌మ్మెను నిషేధించి ఏపీ ప్రభుత్వం

ఏపీలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ‌నుల శాఖ‌లో స‌మ్మెను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిషేధించింది. ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఉద్యోగులు విధుల‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశాలు జారీ చేసింది. విధుల‌కు హాజ‌రుకాని ఉద్యోగుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని గ‌నుల శాఖ డైరెక్ట‌ర్ తెలిపారు.

పీఆర్సీ సాధన సమితి నాయకులకు, మంత్రుల కమిటీకి మధ్య నిన్న అర్ధరాత్రి దాటి ఒంటి గంట వరకు చర్చలు జరిగాయి. ఐఆర్‌ రికవరీ చేయబోమని, పీఆర్‌సీని ఐదేళ్లకు ఒకసారి వేస్తామని మంత్రుల కమిటీ నుంచి ఉద్యోగ సంఘ నేతలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక శనివారం పీఆర్సీపై ఆర్థికశాఖ అధికారులతో మంత్రుల కమిటీ భేటీ అయిన సంగతి తెలిసిందే. అనంతరం మంత్రుల కమిటీ సీఎం జగన్ తోనూ సమావేశం అయింది. ఆ వెంటనే గ‌నుల శాఖ‌లో స‌మ్మెను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.