ThankYou షూటింగ్ కంప్లీట్

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య-రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్యూ’. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చైతు క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. టైమ్ ట్రావెల్ కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ‘మనం’ తరువాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతూ నటించిన సినిమ ఇది.

తాజాగా ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. గ్రూప్ ఫోటోలను షేర్ చేస్తూ నాగ చైతన్య.. “థాంక్యూ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.. వీరి దగ్గర చాలా నేర్చుకున్నాను. ఏ సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలను మీతో పంచుకోవడానికి ఎదురుచూడలేకపోతున్నా” అంటూ ట్వీట్ చేశాడు.