త్వరలో ఒక్కటి కాబోతున్న రణ్బీర్ కపూర్ -ఆలియా భట్
భాలివుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, ఆలియా భట్ గత మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ జంట వచ్చే ఏప్రిల్లో వివాహం చేసుకోనున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయితే వీళ్ల పెళ్లి ముంబయిలో జరగనుందని కూడా కొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఆలియా-రణ్బీర్ మాత్రం తమ వివాహం గ్రాండ్గా కాకుండా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే చేసుకోవాలని భావిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో టీవీ నటీనటులతో పాటు పలువురు సినిమా స్టార్స్ ఏడడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలియా-రణ్బీర్ ఒక్కటికానున్నట్లు తెలుస్తోంది.కాగా ఆలియా-రణ్బీర్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ ఈ ఏడాది సెప్టెంబరు 9న విడుదల కానుంది. ఆలియా నటించిన ‘ఆర్ఆర్ఆర్’, ‘గంగూబాయ్ కతియావాడి’ చిత్రాలు కుడా రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.