జగన్ తో చేతులు కలపనున్న ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి పొలిటికల్ హెడ్ లైన్స్ లోకి వచ్చేశారు. గురువారం టాలీవుడ్ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ ను కలవబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి చిరుతో పాటు యంగ్ స్టార్స్ ప్రభాస్, మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్ కూడా వెళ్తున్నారనే న్యూస్ వైరల్ అవుతున్నది.
మహేష్, ప్రభాస్ సీఎం జగన్ తో చేతులు కలిపితే వచ్చే నష్టమేమీ లేదు. కానీ తారక్ జగన్ తో చేతులు కలిపితేనే.. ఏపీ రాజకీయాలు హీటెక్కేలా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా… ఎప్పటికైనా.. టీడీపీ పగ్గాలు చేపట్టేది ఎన్ టీఆర్ నే. జగన్ ను ఢీకొట్టేది ఆయనే అని ఆంధ్రా జనాలు, తెలుగు తమ్ముళ్లు స్ట్రాంగ్ గా ఫిక్సయిపోయారు.
ఈ నేపథ్యంలో రేపటి సీఎం జగన్ భేటీకి నిజంగా తారక్ హాజరైతే పొలిటికల్ టెంపరేచర్ మాములుగా ఉండదు. వాస్తవానికి.. చాన్నాళ్ల నుంచి తారక్ కు పొలిటికల్ ఆహ్వానాలు అందుతున్నాయి. కానీ ఆయన దండం పెట్టి.. సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. తనకి ఇప్పుడే రాజకీయాలు ఎందుకు ? అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అయినా ఆయన ప్రేమేయం లేకుండానే పొలిటికల్ స్టార్ గా తరచూ హెడ్ లైన్స్ లో నిలుస్తుంటారు.