టీజర్ టాక్ : కత్తు వాకుల రెండు కాదల్ – ట్రిపుల్ ట్రీట్
విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కత్తు వాకుల రెండు కాదల్’ #Kaathuvaakula Rendu Kaadhal. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ని రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. విజయ్ సేతుపతికి ఇద్దరు ప్రియురాళ్లు. నయన్, సామ్ ఇద్దరూ ప్రాణమే. వీరిలో ఒకరిని తేల్చుకొనే క్రమంలో అతడు పడిన టెన్షన్ ను వినోదాత్మకంగా తెరకెక్కించారు. అయితే ఇద్దరి ప్రేమలో పడటానికి గల కారణాలు ఏంటీ ? ఫైనల్ గా ఇద్దరిలో ఎవరికి ఫిక్సయ్యాడు ? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక టీజర్ లో ఇద్దరు ముద్దుగుమ్మలు అదరగొట్టారు. విజయ్ ఎప్పటిలాగే తన పాత్రలో జీవించేశాడు.