థర్డ్ వేవ్ తగ్గిపోయింది

దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. తాజాగా కొత్త కేసులు 50 వేలకు దిగొచ్చాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 50,407 కేసులు మాత్రమే నమోదయ్యాయి.  ముందురోజు కంటే కేసులు 13 శాతం మేర తగ్గాయి. దాంతో పాజిటివిటీ రేటు 3.48 శాతానికి క్షీణించిందని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు 6 లక్షల (1.43 శాతం)కు పడిపోయాయి. నిన్న ఒక్కరోజే 1,36,962 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.

ఈ రెండేళ్ల వ్యవధిలో 4.25 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.14 కోట్ల మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. రికవరీ రేటు 97.37 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు 5,07,981 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 804 మంది మృత్యుఒడికి చేరుకోగా.. క్రితం రోజుతో పోలిస్తే మరణాల సంఖ్య (657) పెరిగింది. కరోనా కేసులు తగ్గిముఖం పట్టడంతో.. దేశంలో కరోనా మూడో వేవ్ ముగినట్టేనని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.