‘భీమ్లా నాయక్’లో అజ్ణాతవాసి భయం
‘భీమ్లా నాయక్’కు సాగర్ చంద్ర దర్శకుడు. కానీ త్రివిక్రమ్ అంతా తానై వ్యవహరించాడు. తరచూ సెట్స్ కు వచ్చాడనే ప్రచారం ఉంది. అది నిజమేనని, దానికి గల కారణాలను కూడా నిర్మాత నాగ వంశీ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.
స్క్రీన్ ప్లే-డైలాగ్స్ కు మాత్రమే పరిమితం చేయకుండా.. అంతకుమించి త్రివిక్రమ్ ను ఇన్ వాల్వ్ చేయడానికి గల కారణాన్ని బయటపెట్టాడు నాగవంశీ. గతంలో పవన్ కల్యాణ్ కు అజ్ఞాతవాసి రూపంలో డిజాస్టర్ ఇచ్చారు ఈ నిర్మాతలు. అందుకే ఈసారి ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా ఉండేందుకు త్రివిక్రమ్ ను సెట్స్ కు తీసుకొచ్చారట.
“భీమ్లానాయక్ సెట్స్ లోకి త్రివిక్రమ్ ను తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంది. పవన్ కల్యాణ్ విషయంలో మేం తప్పు చేశాం. తప్పు జరిగిపోయింది. ఆ తప్పు మళ్లీ రిపీట్ అవ్వకూడదనేది మా ఆలోచన. ఆ భయం, బాధ్యతతోనే త్రివిక్రమ్ ను భీమ్లానాయక్ సెట్స్ లోకి రమ్మని మేం రిక్వెస్ట్ చేశాం. పవన్ కల్యాణ్ కు, ఆయన ఫ్యాన్స్ కు బాకీ ఉన్నాం. ఆ బాకీ తీర్చాల్సిందే.”నని చెప్పుకొచ్చారు. భీమ్లానాయక్ సినిమా ఫిబ్రవరి 25న వస్తుందా, ఏప్రిల్ 1న వస్తుందా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదని చెప్పారు.