#ArabicKuthu అదిరిపోయింది

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న చిత్రం ‘బీస్ట్’. పూజా హెగ్డే హీరోయిన్. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది చిత్రబృందం.

ఇందుకోసం వాలెంటైన్స్ డే ను అద్భుతంగా వాడుకుంది. ఫస్ట్ సింగిల్ Arabic Kuthu వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ట్యూన్ చాలా క్యాచీగా ఉంది. ఇక సాంగ్ లో విజయ్-పూజా అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టేశారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. మాస్టర్ తర్వాత విజయ్ నుంచి వస్తున్న చిత్రమిది. డాక్టర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ నుంచి వస్తున్న సినిమా ఇది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేసేలా Arabic Kuthu ఉంది.