F3 కొత్త రిలీజ్ డేట్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ – తమన్నా, వరుణ్ తేజ్ – మెహ్రీన్ జంటగా నటిస్తున్న ఫన్ ఎంటర్టైనర్ ఎఫ్ 3. ఈ నవ్వుల చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏప్రిల్ 28కి ఎఫ్3 ఫిక్సయిన.. వరుస సినిమాల రిలీజ్ నేపథ్యంలో ఈ చిత్రం మరింత వెనక్కి వెళ్లింది. మే 27న ఎఫ్ 3ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం తాజాగా అధికారిక ప్రకటన చేసింది. 

2019 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే. అసలు సిసలు సంక్రాంతి సినిమా అనిపించుకుంది. అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడీ.. ఫన్ రైడ్ కి సీక్వెల్ గా వస్తున్న ఎఫ్ 3 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎక్స్ ఫన్ డోస్ తో తెరకెక్కించినట్టు దర్శకుడు అనిల్ రావిపూడి చెబుతున్నారు. సీక్వెల్ లో సునీల్, అనసూయ.. తదితరులు సందడి చేయబోతున్నారు.