కళావతి రికార్డుల మోత

కళావతి అందానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిదా అయ్యారు. ఆమె కోసం లవ్ సాంగ్ వేసుకున్నాడు. ఇప్పుడు.. ఈ సాంగ్ రికార్డుల మోత మోగిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో మహేష్-కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘కళావతి.. ‘ ప్రేమికుల రోజు కానుకగా ఆదివారం రిలీజ్ అయింది. సాంగ్ అదిరిపోయింది. మహేష్ అందంగా ఉన్నాడంటే.. కీర్తి మరింత అందంగా కనిపించింది. జోడి అదిరింది. బహుశా.. మహేష్ కు ఇంత ఫర్ ఫెక్ట్ గా సూటైన మరో హీరోయిన్ లేదేమో.. !

ఇక కళావతి సాంగ్ రికార్డుల మోత మోగిస్తోంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ టాప్ లో కొనసాగుతోంది. అత్యంత వేగంగా 12 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న సాంగ్ గా రికార్డ్ సృష్టించింది. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. సిద్ధ్ శ్రీరామ్ పాడారు. థమన్ సంగీతం అందించారు. మే 12న సర్కారు వారి పాట ప్రేక్షకుల ముందుకు రానుంది.