మారన్ Valentine’s గిఫ్ట్

 ధనుష్ – మాళవిక మోహనన్ జంటగా నటిస్తున్న తమిళ చిత్రం ‘మారన్’. కార్తిక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి వాలైంటైన్స్ డే గిఫ్ట్ వచ్చేసింది. సరికొత్త పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ధనుష్-మాళవిక రొమాంటిక్ మూడ్ లో ఉన్న పోస్టర్ అదిరిపోయింది.

ఈ చిత్రంలో సముద్రఖనీ విలన్ గా నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. టీ.జీ త్యాగరాజన్ నిర్మాత. సంక్రాంతి  మారన్ మోస్టర్ పోస్టర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఒక నిమిషం 13 సెకన్ల నిడివి గల వీడియో.. యాక్షన్ మూడ్ అదిరింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. మోషన్ పోస్టర్ తర్వాత విడుదల చేసిన కొత్త పిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.  త్వరలో ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.