కొత్త ఆసరా ఎప్పుడు ?

తెలంగాణలో ప్రస్తుతం ఆసరా పథకంలో నమోదైన వారు 38,42,312  మంది ఉన్నారు. ప్రభుత్వం వీరికి రూ.2016, రూ.3016లు అందిస్తుంది. అయితే కొత్తగా ఆసరా పథకం ద్వారా సాయం కోసం లక్షల మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఆసరా పథకంలో నమోదైన వారు 38,42,312 కాగా, గత నాలుగేళ్లగా మరో 5 నుంచి 6 లక్షల మంది అర్హులు పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారు.

దీనిపై ఓ నెటిజన్ ఆర్టీఐ ద్వారా వెయిటింగ్‌లో ఉన్న లబ్ధిదారుల జాబితాను సేకరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో గెలిచిన అనంతరం వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు 58 నుంచి 57 ఏళ్లకు తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో మరో 2 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాల్సి ఉంది.ఈ క్రమంలో ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో గత మూడున్నరేళ్లుగా 3,15,262 మంది ఆసరా పెన్షన్ కోసం ఎదురుచూస్తుననారని పేర్కొన్నారు.