బిగ్ బీని కలిసిన పవన్

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశారు. ప్రభాస్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ కోసం హైద్రరాబాద్ వచ్చిన అమితాబ్‌ను ఈరోజు పవన్ రామోజీ ఫిల్మ్ సిటీలో మర్యాద పూర్వకంగానే కలిసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. పవన్ నటిస్తున్న తొలి హిస్టారికల్ సినిమా ఇది. ఈ నేపథ్యంలో స్వయంగా పవన్ బిగ్ బీ అమితాబ్ ని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సినిమాలో ఏదైనా కీలక పాత్రలో అమితాబ్ ను అడగడానికి ఆయన్ని పవన్ కలిశారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ పక్కన నిధి అగర్వాల్ నటిస్తున్నది. ఇక పవన్ నటించిన భీమ్లా నాయక్ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.