పంత్ వైఎస్ కెప్టెన్

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ నియమితుడయ్యాడు. కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్ గాయాలతో ఇప్పటికే సిరీస్‌కు దూరమయ్యారు. రాహుల్ గైర్హాజరీలో పంత్‌కు వైస్ కెప్టెన్సీ దక్కింది.
ఇక ఆఫ్‌స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ తొడకండరాల గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. విండీస్‌తో మూడో వన్డే సందర్భంగా అతడు గాయపడ్డట్లు బీసీసీఐ తెలిపింది. అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులో స్థానం సంపాదించాడు.