హ్యాకింగ్‌కు గురైన సంసద్ టీవీ
పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసే సంసద్ టీవీ హ్యాక్ కు గురైంది. తమ యూట్యూబ్ ఛానల్‌ను కొందరు మోసగాళ్లు హ్యాక్ చేసినట్లు సంసద్ టీవీ వివరణ ఇచ్చింది. దీనిని సరిచేసేందుకు యూట్యూబ్ ప్రయత్నిస్తోందని వెల్లడించింది.
మరోవైపు సంసద్ టీవీ యూట్యూబ్ ఖాతాను తాజాగా తొలగించారు. ఈ ఖాతాను తొలగిస్తున్నట్లు యూట్యూబ్ మంగళవారం ప్రకటించింది. తమ కమ్యూనిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను ఈ చర్య తీసుకొన్నట్లు వివరణ ఇచ్చింది.