రొమాంటిక్ నమస్తే..

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ టైటిల్ రోల్ లో నటించిన చిత్రం “గంగూబాయి కథియావాడి”. హుస్సేన్ జైదీ రాసిన పుస్తకం ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా తెరకెక్కించారు.

గంగా హర్జీవందాస్ అలియాస్ గంగూబాయ్ పాత్రలో అలియా నటించారు. అజయ్ దేవగన్, హుమా ఖురేషి, ఇమ్రాన్ హష్మీ ప్రత్యేక పాత్రల్లో నటించారు. పెన్ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. వచ్చేవారం (ఫిబ్రవరి 25) గంగుభాయ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా  72వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో కలిసి బెర్లిన్ వెళ్లిన.. అలియా..బెర్లిన్  ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పేట్ పై మెరిసింది. అభిమానుల కేరింతల మధ్య వారికి ఆటోగ్రాఫ్ ఇస్తూ.. సందడి చేసింది. ఈ సందర్భంగా గంగూభాయ్ సిగ్నేచర్ నమస్తే.. ఉల్టా నమస్తే.. పెట్టింది. అక్కడ ప్రేక్షకులతోనూ ఈ రొమాంటి నమస్తే పెట్టించింది.